లులు మాల్ కిచెన్ లో పురుగులు, కుళ్లిన కూరగాయలు : ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ఘోరాలు

 లులు మాల్ కిచెన్ లో పురుగులు, కుళ్లిన కూరగాయలు : ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ఘోరాలు

హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో ఉన్న లులుమాల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల లులుమాల్ మిక్చర్ లో ఫ్రైడ్ బల్లి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో పాటు ఫిర్యాదు అందడంతో మంగళవారం ( మే 19 ) లులు హైపర్ మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో ఇన్ హౌస్ కిచెన్ లో పరిశుభ్రత లోపాలు గుర్తించారు అధికారులు. కిచెన్ పరిసరాల్లో పురుగులు, కీటకాలు గుర్తించామని... కుళ్లిపోయిన కూరగాయలు గుర్తించామని తెలిపారు అధికారులు.

ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన మిగిలిన ఆహార పదార్థాల స్వాధీనం చేసుకొని.. అక్కడికక్కడే తొలగించారు అధికారులు. గడువు ముగియనున్న ప్యాక్డ్ ఫుడ్‌పై తప్పుదారి పట్టించే లేబుళ్లు గుర్తించామని.. బేసన్ పిండి, ఆటా, పప్పుల్లో పురుగులను గుర్తించామని తెలిపారు అధికారులు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్‌తో ఫుడ్ ప్యాకెట్లు విక్రయిస్తున్నారని తెలిపారు అధికారులు.

ప్యాకెట్లపై పోషక విలువలు, తయారీదారు వివరాలు లేవని.. బుచరింగ్ ఏరియాలో మాంస వ్యర్థాలతో డ్రైన్లు మూసుకుపోయాయని తెలిపారు అధికారులు. దుర్వాసనతో ప్రజారోగ్యానికి ముప్పు ఉందంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. సుమారు 150 కిలోల స్వీట్స్, నూనెలు, పిండి, పప్పుల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.

కల్తీ అనుమానంతో ఫుడ్ శాంపిల్స్ సేకరించామని..అధిక కృత్రిమ రంగుల వినియోగంపై ల్యాబ్‌కు నమూనాల పంపించామని తెలిపారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.