ఇంట‌ర్ నెట్ కోసం 50 కిలోమీట‌ర్లు దూరం ప్ర‌యాణిస్తున్న 200 మంది పిల్ల‌లు

ఇంట‌ర్ నెట్  కోసం 50 కిలోమీట‌ర్లు దూరం ప్ర‌యాణిస్తున్న 200 మంది పిల్ల‌లు

ఆన్ లైన్ క్లాసుల‌కు అటెండ్ అవ్వాలంటే ఇబ్బందిగా ఉందంటూ ఓ బాలుడు జిల్లా అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు

మహారాష్ట్ర ర‌త్న‌గిరి జిల్లా తీరప్రాంతాలకు చెందిన మారుమూల గ్రామాలకు చెందిన సుమారు 200మంది విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసుల‌కు అటెండ్ అవుతున్నారు. ఇందుకోసం ప్ర‌తీ రోజు 50కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేస్తున్నారు.

అయితే ఇటీవ‌ల నిసర్గ తుఫాను కార‌ణంగా మ‌హ‌రాష్ట్ర‌లోని ర‌త్నగిరి జిల్లా తీర‌ప్రాంతాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఇంట‌ర్నెట్, క‌రెంట్, సెల్ ట‌వ‌ర్ సౌక‌ర్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి.

దీంతో పిల్ల‌ల‌కు ఆన్ లైన్ క్లాసుల‌కు ఇబ్బంది త‌లెత్తింది. ఇంట‌ర్నెట్ కోసం 50 కిలోమీట‌ర్ల దూరం వెళ్లాల్సి వ‌చ్చేది. స్కూల్ టీచ‌ర్లు సైతం ఆన్ లైన్ క్లాసుల‌కు త‌ప్ప‌ని స‌రిగా అటెండ్ అవ్వాల‌ని ష‌ర‌తులు విధించ‌డంతో నెల రోజుల పాటు స్కూల్ కు వెళ్లిన విద్యార్ధులు అస‌హ‌నానికి గుర‌య్యారు.

త‌మ ఊరిలో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేదు. ఆన్ లైన్ క్లాసుల‌కు అటెండ్ అవ్వాలంటే 50కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుందంటూ ఓ బాలుడు

శిశు హక్కుల సంఘం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్సీపీసీ ఆర్ , సెల్యులర్ కంపెనీలు ఆ ప్రాంత జిల్లా మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేయ‌డం ద్వారా కనెక్టివిటీని వేగంగా పునరుద్ధరించవ‌చ్చ‌ని ఎన్‌సిపిసిఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో చెప్పారు.