డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్​పీఐలు రూ. 11,557 కోట్లు

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్​పీఐలు రూ. 11,557 కోట్లు

న్యూఢిల్లీ: కరోనా సమస్యలు, మార్కెట్లో కరెక్షన్​ వచ్చినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్​పీఐలు) డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌లో భారతీయ ఈక్విటీలలో నికరంగా రూ. 11,557 కోట్లను పెట్టుబడిగా మార్చారు. ఇకముందు యూఎస్​,  కొవిడ్ వార్తల నుంచి వచ్చే స్థూల డేటా ఎఫ్​పీఐ ఫ్లోలను,  మార్కెట్లను నడిపిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ స్ట్రాటజిస్ట్  విజయకుమార్ అన్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం, ఫారిన్ పోర్ట్‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్​పీఐలు) డిసెంబర్ 1-–23 మధ్య కాలంలో ఈక్విటీలలో రూ.11,557 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. డాలర్ ఇండెక్స్ బలహీనపడటం  మొత్తం స్థూల ఆర్థిక ధోరణుల పట్ల సానుకూలత కారణంగా నవంబర్‌‌‌‌లో రూ. 36,200 కోట్లు ఇన్వెస్ట్​ చేశారు.  ఇదే ఏడాది అక్టోబర్‌‌‌‌లో రూ.8 కోట్లు, సెప్టెంబర్‌‌‌‌లో రూ.7,624 కోట్లను ఎఫ్​పీఐలు వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల లెక్కలు వెల్లడించాయి. ఈనెల 23తో ముగిసిన వారంలో నెట్​ ఇన్‌‌‌‌ఫ్లో పరిమాణం చాలా తక్కువగా రూ.1,000 కోట్ల వరకు ఉంది. అంతకుముందు వారంలో రూ.6,055 కోట్లు వచ్చాయి.

 డిసెంబరు మొదటి సగ భాగంలో, ఎఫ్​పీఐలు ఆటోలు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌‌‌‌ఎంసిజి,  రియల్ ఎస్టేట్ స్టాక్‌‌‌‌లను బాగా కొన్నారు. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్  ఫైనాన్షియల్‌‌‌‌లలో పెట్టుబడులను అమ్మేశారు.  2022లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్​పీఐలు రూ. 1.21 లక్షల కోట్ల నికర మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. డిసెంబరులో డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,900 కోట్ల నికర మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. భారతదేశం మినహా, ఈ నెలలో ఇప్పటివరకు ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్  ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎఫ్​పీఐ ఫ్లో ప్రతికూలంగా ఉంది.