మహిళలకు దిక్సూచిగా ‘ఆమె.. ఒక విజేత’ పుస్తకం : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

మహిళలకు దిక్సూచిగా ‘ఆమె.. ఒక విజేత’ పుస్తకం : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్, వెలుగు: జీవిత పోరాటంలో సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ‘ఆమె.. ఒక విజేత’ పుస్తకం మార్గదర్శిగా నిలుస్తుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌‌లోని జేడీ ఫౌండేషన్ కార్యాలయంలో ప్రముఖ రచయిత్రి పింగిలి కవితారెడ్డి రచించిన ‘ఆమె.. ఒక విజేత’ పుస్తకాన్ని  జేడీ లక్ష్మీనారాయణ  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషిలోని భావాలను తెలియజేయడానికి చాలా మాధ్యమాలు ఉన్నాయని, రచయిత్రి కవితా రెడ్డి వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి   మాట్లాడుతూ..సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లు వాటిని అధిగమించి విజేతలుగా నిలిచే మార్గాలను రచయిత్రి పుస్తకంలో చక్కగా వివరించారని వెల్లడించారు.