సలార్ స్పెషల్ సాంగ్లో మాజీ ప్రపంచ సుందరి?

 సలార్ స్పెషల్ సాంగ్లో మాజీ ప్రపంచ సుందరి?

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా వస్తున్న మూవీ సలార్ (Salaar). ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాకు రాని హైప్ ఈ సినిమాకు వచ్చింది. నిజానికి బాహుబలి తరువాత ప్రభాస్ కటౌట్కి తగ్గ సినిమా అంటే సలార్ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

లేటెస్ట్గా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ పెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ పక్కన ఈ సాంగ్లో డ్యాన్స్ చేయడానికి బాలీవుడ్ కలల సుందరి ఐశ్వర్యరాయ్(Aishwaryarai)ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ సలార్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్గా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్గా ప్రభాస్ మోకాలికి గాయం కావడంతో ఈ సాంగ్ షూటింగ్ను కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక సలార్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్కు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐశ్వర్యరాయ్..ప్రభాస్ డ్యాన్స్ నంబర్ ఎలా ఉండనుందో అని క్యూరియాసిటీ ఆడియన్స్లో పీక్స్లో ఉంటుంది.వీరిద్దరి స్పెషల్ సాంగ్ కనుక సెట్ అయితే, సలార్ మూవీకి మరో స్పెషల్ అని చెప్పుకోవాలి. మరి ఈ స్పెషల్ సాంగ్లో కవ్వించేది ఎవరనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

 ఇక సలార్ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాగా త్వరలో రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.