పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజీజు, నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)ని కూడా బీజేపీలో విలీనం చేశారు. కాంగ్రెస్ మాజీ లీడర్, మాజీ డిప్యూటీ స్పీకర్ అజీబ్ సింగ్ భట్టితో పాటు..ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా అమరీందర్ సింగ్ తో పాటు..బీజేపీలో చేరారు.
Former Punjab CM Capt Amarinder Singh joins BJP; merges his party Punjab Lok Congress (PLC) with BJP pic.twitter.com/nXCINNzNLI
— ANI (@ANI) September 19, 2022
సిద్ధూతో విభేదాలు..
50 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన అమరీందర్.. గతేడాది పార్టీకి గుడ్ బై చెప్పారు. నవజ్యోత్ సింగ్‌తో విభేదాలు రావడంతో అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమరీందర్ సింగ్..కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయగా..ఒక్క సీటులోనూ విజయం సాధించలేదు. పాటియాలా నుంచి పోటీ చేసి..అమరీందర్ సింగ్ కూడా ఓటమిపాలయ్యారు.
