ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆదివారం నాలుగో పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు కోటకు క్యూ కట్టారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలతో తరలి వచ్చి అమ్మవారికి సమర్పించారు. కార్వాన్, జియాగూడ, సబ్జిమండి, సీతారాంబాగ్, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ, మెహిదీపట్నం, లంగర్ హౌస్, షేక్‌పేట ప్రాంతాల నుంచి తొట్టెలను ఊరేగిస్తూ కోటకు తీసుకొచ్చారు.
రాత్రి 8 గంటల వరకు ఊరేగింపులు కొనసాగాయి. సాయంత్రం రద్దీని తట్టుకోలేక కొందరు అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుతిరిగారు. అలాగే ఓల్డ్ బోయిగూడలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించే తొలిబోనం కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్పాల్గొన్నారు. జోగిని శ్యామలకు బోనమెత్తారు.
–వెలుగు, మెహిదీపట్నం/సికింద్రాబాద్
