IPL 2026: గెలిచిన సంతోషం కూడా లేదు పాపం: జీటీ కెప్టెన్ గిల్‎కు భారీ జరిమానా

IPL 2026: గెలిచిన సంతోషం కూడా లేదు పాపం: జీటీ కెప్టెన్ గిల్‎కు భారీ జరిమానా

గాంధీ నగర్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‎కు ఐపీఎల్ మేనేజ్మెంట్ భారీ జరిమానా విధించింది. బుధవారం (ఏప్రిల్ 8) ఢిల్లీ క్యాపిటల్స్‏తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించింది. గుజరాత్ తమ 20 ఓవర్ల కోటా పూర్తి చేయడానికి నిర్దేశించిన టైమ్ కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించడంతో ఫైన్ వేసినట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఐపీఎల్ సీజన్ 19లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన జీటీ ఢిల్లీపై గెలిచి బోణీ కొట్టింది. కానీ స్లో ఓవర్ రేటింగ్ కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించడంతో ఆ సంతోషం గుజరాత్ కెప్టెన్‎కు ఎంతో సేపు నిలవలేదు. 

1 రన్‎తో గట్టెక్కిన గుజరాత్

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో చివరి వరకు అద్భుతంగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ చివరి రెండు బాల్స్‌‌లో బోల్తా కొట్టింది. రెండు బాల్స్‌‌కు రెండు రన్స్‌‌ అవసరమైన దశలో హార్డ్‌‌ హిట్టర్‌‌ డేవిడ్‌‌ మిల్లర్‌‌ (20 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 41 నాటౌట్‌‌)ను ప్రసిధ్‌‌ కృష్ణ (2/52) సూపర్బ్‌‌గా కట్టడి చేశాడు. ఫలితంగా గుజరాత్‌‌ ఒక్క రన్స్‌‌ తేడాతో ఢిల్లీపై గెలిచి ఐపీఎల్‌‌–19లో బోణీ చేసింది. టాస్‌‌ ఓడిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 210/4 స్కోరు చేసింది.

►ALSO READ | ఆసియా సీనియర్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో నితేష్‌‌కు రజతం

కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (45 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 70), జోస్‌‌ బట్లర్‌‌ (27 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 52), వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (32 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 55) దంచికొట్టారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 209/8 స్కోరుకే పరిమితమైంది. కేఎల్‌‌ రాహుల్‌‌ (52 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 92) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. రషీద్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.