కోల్ ఇండియాలో పర్మనెంట్ ఉద్యోగాలు... డిప్లొమా చేసినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగావకాశం.. పూర్తి వివరాలివే!

కోల్ ఇండియాలో పర్మనెంట్ ఉద్యోగాలు... డిప్లొమా  చేసినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగావకాశం.. పూర్తి వివరాలివే!

కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్  అనుబంధ మినీరత్న కంపెనీ అయిన వెస్టర్న్ కోల్‌‌‌‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న డబ్ల్యూసీఎల్ భూగర్భ, ఓపెన్‌‌‌‌కాస్ట్ గనుల కోసం మైనింగ్ సర్దార్, అసిస్టెంట్ ఫోర్‌‌‌‌మెన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 444 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు: 444. 

విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్ సర్దార్ , టీ & ఎస్ గ్రేడ్–సి 220, అసిస్టెంట్ ఫోర్​మెన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రికల్ సూపర్​వైజర్, టీ & ఎస్ గ్రేడ్–సి 224. 

విద్యార్హతలు 
మైనింగ్ సర్దార్: డీజీఎంఎస్ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే మైనింగ్ సర్దార్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే గ్యాస్ టెస్టింగ్,   ఫస్ట్- ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. భూగర్భ గనుల్లో కనీసం మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి.  లేదా  గుర్తింపు పొందిన సంస్థ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌‌‌‌లో డిప్లొమా, డీజీఎంఎస్ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఓవర్‌‌‌‌మన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్-ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

అసిస్టెంట్ ఫోర్​మన్ (ట్రైనీ):  గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌‌‌‌లో  3 సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసి ఉండాలి.  ప్రభుత్వశాఖ లేదా సంస్థ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే మైన్స్ ఎలక్ట్రికల్ సూపర్‌‌‌‌వైజరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్: అన్ రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌‌‌‌ లకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్, డిపార్ట్​మెంటల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

లాస్ట్ డేట్: ఆగస్టు 10. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.westerncoal.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. పార్ట్–1లో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, పార్ట్–2లో టెక్నికల్ విభాగం నుంచి 80 ప్రశ్నలు 80 మార్కులకు ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. 
కనీస అర్హత మార్కులు:  అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 50  మార్కులు, ఓబీసీ 45  మార్కులు, ఎస్సీ/ ఎస్టీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

మైనింగ్ సర్దార్ పోస్టులకు ఆరు నెలల ప్రొబేషన్, అసిస్టెంట్ ఫోర్​మన్ (ట్రైనీ) పోస్టులకు రెండేళ్లు ట్రైనింగ్ ఉంటుంది.