రఘునాథపల్లి,వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని అశ్వారావుపల్లిలో సోలార్‌పవర్‌ప్లాంట్‌ఏర్పాటు కోస్ జనగామ కలెక్టర్‌సందీప్‌కుమార్‌ఝా గురువారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల విషయంలో జాప్యం జరగకుండా సత్వరమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ యూనిట్‌ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, కాలుష్య రహిత విద్యుత్‌అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఏ పీడీ వసంత, రెడ్కో అధికారులు, వెండర్లు ,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
