జోగినీలపై విమర్శలు సరికాదు.. ప్రభుత్వాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు

జోగినీలపై విమర్శలు సరికాదు.. ప్రభుత్వాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు

పంజాగుట్ట, వెలుగు: జోగినీల అభ్యున్నతి కోసం తాను 30 ఏండ్లుగా పోరాడుతున్నానని, ప్రభుత్వాలు జ్యోగినీలపై విమర్శలు చేయడం సరికాదని జోగిని శ్యామల అన్నారు. తాను ఎవరినీ నిందించనని, ప్రభుత్వాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారని తెలిపారు.

 గురువారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్​అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శ్రేణులు, ప్రస్తుతం కాంగ్రెస్​ అధికారంలో ఉంటే బీఆర్ఎస్​శ్రేణులు జోగినీలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొందరు జోగినీలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో దుర్గా రమేశ్, కల్యాణి, గణేశ్, కిశోర్, లాయర్​సాయికృష్ణ పాల్గొన్నారు.