IPL 2026: ఈడెన్ గార్డెన్స్లో కీలక పోరు.. KKR vs LSG మ్యాచ్‌కు వర్షం ముప్పు, మళ్లీ టాస్ ఆలస్యం

IPL 2026: ఈడెన్ గార్డెన్స్లో కీలక పోరు.. KKR vs LSG మ్యాచ్‌కు వర్షం ముప్పు, మళ్లీ టాస్ ఆలస్యం

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్ లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు (2026, ఏప్రిల్ 9వ తేదీన) జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉంది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఆడిన మ్యాచ్‌ల్లో ఇంకా విజయం సాధించలేదు. పంజాబ్‌తో జరగాల్సిన గత మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో కేవలం ఒక పాయింట్‌తో ఖాతా తెరిచింది. మరోవైపు, గత మ్యాచ్‌లో విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఉత్సాహంతో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీమ్ పాయింట్స్ టేబుల్ లో 7వ స్థానంలో ఉన్నారు.

కోల్‌కతాకి ఎల్లో అలర్ట్: 
కోల్‌కతాలో ప్రస్తుతం వాతావరణం మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. దీంతో ఏ క్షణమైన వాన పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఏప్రిల్ 8న భారీ ఉరుములతో కూడిన వర్షం పడటంతో భారత వాతావరణ శాఖ (IMD) 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేయగా, ఈరోజు (ఏప్రిల్ 9) మ్యాచ్ జరిగే సమయానికి 'ఎల్లో అలర్ట్' ప్రకటించారు.

Also Read : ఆ ఒక్క నిర్ణయంతో గుజరాత్ జట్టులో గొడ

వర్షం ముప్పు: మ్యాచ్ మొదలయ్యే ( సాయంత్రం 7:30 గంటలకు) సమయానికి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

టాస్ ఆలస్యం: రాత్రి 7 గంటలకు జరగాల్సిన టాస్ వర్షం కారణంగా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

పిచ్ పరిస్థితి: గత వారం రోజులుగా కురుస్తున్న "కాల్‌బైశాఖి" తుఫానుల వల్ల స్టేడియం మొత్తం తేమగా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో డ్రైనేజీ వ్యవస్థ బాగున్నప్పటికీ, మళ్లీ మళ్లీ వర్షం పడితే మ్యాచ్ ఓవర్లను తగ్గించే అవకాశం ఉంటుంది.

ఇరు జట్ల అంచనా: 
కోల్‌కతా నైట్ రైడర్స్: 
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరబానీ, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి

లక్నో సూపర్ జెయింట్స్:
రిషబ్ పంత్ (కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, మొహ్సిన్ ఖాన్, అర్జున్ టెండూల్కర్