Ashish Nehra: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ఒక్క పరుగుతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా కొనసాగిన ఈ మ్యాచ్ అభిమానులను బాగా అలరించింది. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఒక తప్పిదంపై ఆయన తీవ్రంగా మండిపడ్డిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో జరిగిన ఓవర్ త్రో ఘటన మ్యాచ్‌ను మలుపుతిప్పేలా కనిపించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్‌కీపర్ జోష్ బట్లర్ వైపుకి నేరుగా బంతిని విసిరగా, అది స్టంప్స్‌ను తాకి బౌండరీకి వెళ్లిపోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అదనంగా నాలుగు పరుగులు లభించాయి. ఆ సమయంలో క్రీజ్‌లో కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు. ఈ ఘటనపై కోచ్ నెహ్రా డగౌట్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే బ్యాటింగ్‌లో గిల్ అద్భుతంగా ఆడాడు. 45 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. అలాగే జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు.
Also Read : KKR vs LSG మ్యాచ్‌కు వర్షం ముప్పు, మళ్లీ టాస్ ఆలస్యం
కాగా రెండో ఇన్నింగ్స్‌లో గుజరాత్ టైటాన్స్ విజయంలో మిస్టర్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక బ్యాటర్లు నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ వికెట్లు తీసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు మళ్లించాడు. ఈ మ్యాచ్‌లో లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ జట్టు చివరికి ఒక్క పరుగుతో విజయం సాధించింది.
Gill's Overthrow 🤣
— Honest Kohli Fan™💚❤️ (@49_all_out) April 8, 2026
Ashish Nehra 🎙️: "Benstokes 😭😭 pic.twitter.com/BmjxmZa2F1
