అత్యాశతో 10 రోజుల్లో.. రూ.12 కోట్లు పోగొట్టుకున్న డాక్టర్ : ఇన్ని కోట్లు ఉన్నా.. ఈ కక్కుర్తి ఎందుకు సామీ..!

అత్యాశతో 10 రోజుల్లో.. రూ.12 కోట్లు పోగొట్టుకున్న డాక్టర్ : ఇన్ని కోట్లు ఉన్నా.. ఈ కక్కుర్తి ఎందుకు సామీ..!

డబ్బు.. డబ్బు.. డబ్బు.. కోట్లకు కోట్ల డబ్బు ఉంది. పూణె సిటీలోనే పెద్ద డాక్టర్.. కోట్ల రూపాయలు సంపాదించారు.. అయినా ఆశ చావలేదు.. ఇంకా ఇంకా అని డబ్బు కోసం పరిగెత్తాడు.. ఓ ఇన్వెస్ట్ మెంట్ యాప్ లో పెట్టుబడి పెడితే డబుల్, ట్రిపుల్ అవుతాయని నమ్మాడు.. జస్ట్ 11 అంటే 11రోజుల్లోనే.. ఆ యాప్ లోకి ఏకంగా 12 కోట్ల రూపాయలు బదిలీ చేశాడు.. తీరా చూస్తే ఏమైందీ.. డబుల్, ట్రిపుల్ కాకపోగా.. ఉన్న 12 కోట్ల రూపాయలు పోయాయి.. సైబర్ క్రిమినల్స్ వలలో పడి.. అత్యాశకు పోయి సర్వం పోగొట్టుకున్న ఈ డాక్టర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే.. కేవలం 11 రోజుల్లోనే డబ్బును రెట్టింపు చేస్తామన్న సైబర్ మోసగాళ్లను నమ్మి... ఉన్న రూ. 12 కోట్లు పోగొట్టుకున్నాడు పూణేకి చెందిన డాక్టర్. తమ ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే 11 రోజుల్లో రూ.54 కోట్ల వరకు ఆదాయం వస్తుందని డాక్టర్ ను నమ్మించారు కేటుగాళ్లు.  తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయన్న అత్యాశతో పలు దఫాలుగా కేటుగాళ్లకు డబ్బులు బదిలీ చేశాడు. 

జనవరి నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని ఒక గుర్తుతెలియని నంబర్ నుండి మెసేజ్ రావడంతో ఈ స్కాం మొదలైంది. మెసేజ్ చూసి ఆశపడి రిప్లై ఇచ్చిన డాక్టర్ ను సైబర్ మోసగాళ్లు 'విఐపి స్టాక్ 24' అనే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేశారు. ఈ గ్రూప్ ద్వారా, నిందితులు ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ వివరించారు. మోసగాళ్లు చెప్పిన సూచనలను ఖచ్చితంగా పాటిస్తే, కేవలం 11 రోజుల్లోనే అతని డబ్బు ఎన్నో రెట్లు పెరుగుతుందని డాక్టర్ ను తమ ట్రాప్ లో వేసుకున్నారు కేటుగాళ్లు.

ఫేక్ ట్రేడింగ్ యాప్, ఫేక్ ప్రాఫిట్స్:

బాధితుడు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఫేక్ ట్రేడింగ్ యాప్ ఇన్స్టాల్ చేయించారు కేటుగాళ్లు. యాప్ ద్వారా బాధితుడి పర్సనల్ డీటెయిల్స్, ఆర్థిక వివరాలు తీసుకొని.. బ్యాంకు అకౌంట్స్ కి డబ్బులు పంపమని చెప్పారు. బాధితుడి నుంచి వచ్చిన సొమ్మును నకిలీ ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టినట్లుగా చూపించి... ఫేక్ లాభాలు చూపించి నమ్మించారు.

ALSO READ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 18 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్లు స్వాధీనం 

8 లావాదేవీలలో రూ. 12.31 కోట్లు బదిలీ:

మార్చి 7 నుంచి మార్చి 18 మధ్య, బాధితుడు మోసగాళ్లకు ఎనిమిది వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ. 12.31 కోట్లను బదిలీ చేస్తూ, ఎనిమిది ట్రాంజాక్షన్స్ జరిపినట్లు తెలిపారు పోలీసులు. ఆ తర్వాత మరికొంత డబ్బు పంపేందుకు బాధితుడు నిరాకరించడంతో అతని ఆస్తులు జప్తు చేస్తామని బెదిరించి బలవంతంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని పోలీసులతో వాపోయాడు బాధితుడు.

మోసగాళ్లు చెప్పినట్లు రెట్టింపు లాభాలు వస్తాయని.. దాదాపు మూడు నెలల పాటు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపాడు బాధితుడు. అయితే... డబ్బులు తిరిగి రాకపోవడం... మోసగాళ్లు ఇంకొంచెం డబ్బులు పంపమని అడగడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. 

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లావాదేవీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.