శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 18 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్లు స్వాధీనం 

శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 18 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్లు స్వాధీనం 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న ఖరీదైన వాచ్ లను స్వాధీనం చేసుకున్నారు CISF పోలీసులు. గురువారం ( ఏప్రిల్ 9 ) హైదరాబాద్ నుండి ముంబైలో షో కోసం తరలిస్తున్న 30 రోలెక్స్ వాచ్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం వాచ్ ల విలువ రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

వాచీలు తీసుకెళ్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్, వెలుగు : శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్స్పెక్టర్ సంపతి కనకయ్య ఇంట్లో రూ.34 లక్షలు పట్టుబడ్డాయి. డబ్బులతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను బుధవారం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కనకయ్య ఇంట్లో లభించిన డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేశారు.

ALSO READ : డిస్నీలో మరోసారి ఉద్యోగాల కోత

మరో వైపు ఎస్సై సిద్దేశ్వర్ ఇంట్లో కూడా ఏసీబీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. ఫేక్ పాస్పోర్టు కేసులో పట్టుబడిన నిందితుడి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ మంగళవారం ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా వీరిద్దరి ఇండ్లలో బుధవారం సోదాలు నిర్వహించారు.