సౌదీ అరేబియా ఈస్ట్.. వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ ధ్వంసం : ప్రపంచం ఊహించని విపత్తు రాబోతుందా..?

సౌదీ అరేబియా ఈస్ట్.. వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ ధ్వంసం : ప్రపంచం ఊహించని విపత్తు రాబోతుందా..?

యుద్ధం విధ్వసం ఊహకు అందని విధంగా ఉంది. ఓవైపు కాల్పుల విరమణతో ఊపిరి పీల్చుకుంటున్న దేశాలకు.. ఊహించని పరిణామాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కాల్పుల విరమణ తర్వాత బయటకు వచ్చిన ఈ వార్త.. ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

హర్మూజ్ జల సంధికి ప్రత్యామ్నాయంగా.. సౌదీ అరేబియా నుంచి క్రూడ్ ఆయిల్ ఎగుమతి అయ్యే అతి పెద్ద ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ ధ్వంసం అయ్యింది.  ఇరాన్ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడిలో 12 వందల కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ ఆయిల్ పైప్ లైన్.. సౌదీ అరేబియాకు గుండెకాయ లాంటిది. ఈ ఆయిల్ పైప్ లైన్ ద్వారా రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. ఈ ఆయిల్ ను ఎర్ర సముద్రం తీరంలోని యాన్పు ఓడరేవు నుంచి ఎగుమతి చేస్తారు. హర్మూజ్ జల సంధితో సంబంధం లేకుండా.. ఎర్ర సముద్రం మీదుగా ఆ ఆయిల్ ను ఎగుమతి చేస్తుంది సౌదీ అరేబియా. 

40 రోజులుగా హర్మూజ్ జల సంధి మూసి వేయటంతో.. ఎర్ర సముద్రం మీదుగా.. ఈ ఆయిల్ పైప్ లైన్ ద్వారానే యాన్పు ఓడరేవు నుంచి క్రూడ్ ఆయిల్ ఎగమతి చేస్తుంది. ఇలాంటి పైప్ లైన్ పై డ్రోన్ ఎటాక్ జరిగింది. ఈ క్రమంలోనే పైప్ లైన్ మధ్య భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం మరమ్మత్తులు చేస్తోంది సౌదీ. 24 గంటలుగా పైప్ లైన్ మూసివేశారు. ఈ పైప్ లైన్ ద్వారా ప్రతి రోజూ 5 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం సౌదీ నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఆయిల్ ఎగుమతులకు బ్రేక్ పడింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. 

హర్మూజ్ జల సంధి మూసివేతతో ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు సౌదీ నుంచి సైతం చుక్క ఆయిల్ ఎగుమతి లేకపోతే పరిస్థితి ఏంటనే భయాందోళనలు ఆయా దేశాల్లో నెలకొన్నాయి. సౌదీలోని ఈస్ట్ వెస్ట్ ఈ పైప్ లైన్ ద్వారా ఎగుమతి అవుతున్న ఆయిల్.. ఎర్ర సముద్రం మీదుగా బాబ్ ఎల్ మండేబ్ జల సంధి నుంచి రవాణా జరుగుతుంది. ఇప్పటి వరకు కొద్దోగొప్పో.. అత్యవసర సమయంలో ఆదుకుంటుంది. అలాంటిది సౌదీలోని యాన్పు ఓడరేవు నుంచి కూడా ఆయిల్ ఎగుమతులకు బ్రేక్ పడటంతో.. ప్రపంచ దేశాలకు పెద్ద షాక్ కొట్టినట్లే.. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు ఊహించని ఆయిల్ విపత్తు వచ్చినా ఆశ్చర్యం లేదు..