సికింద్రాబాద్ లో హైడ్రా కూల్చివేతలు.. అడ్డుకున్న స్థానికులు

సికింద్రాబాద్ లో హైడ్రా కూల్చివేతలు.. అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్ సిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగుతున్నాయి. సిటీవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి ఒక్కొక్కటిగా నేలమట్టం చేశారు  హైడ్రా అధికారులు. అందులో భాగంగా గురువారం (ఏప్రిల్ 9) సికింద్రాబద్ లోని ట్రాఫిక్  అంతరాయం కలిగిస్తున్న ఫుట్ పాత్ లపై  పలు దుకాణాలను తొలగించారు. 

సికింద్రాబాద్  పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫుట్ ఫాత్ లపై ఉన్న అక్రమ దుకాణాలను హైడ్రా  అధికారులు తొలగించారు. బేగంపేట్ లోని ప్రకాశ్ ణగర్ లైన్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మున్సిపల్, హైడ్రా అధికారులు ఫుత్ పాత్ లపై ఉన్న షెడ్డులు, డబ్బాలు, స్టాండ్స్ లను  జేసీబీలతో తొలగించారు. 

►ALSO READ | బీఆర్ఎస్‎లో చేరాలని డిసైడ్ అయ్యా: కన్ఫామ్ చేసిన జీవన్ రెడ్డి

కూల్చివేతలను స్థానిక వ్యాపారులు, నివాసితులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారుల నిరసనలతో ప్రకాష్ నగర్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను సముదాయించి కూల్చివేతలు కొనసాగేలా చూశారు.