హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని స్వయంగా ఆయనే ప్రకటించారు. గురువారం (ఏప్రిల్ 9) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన కన్నా, కేసీఆర్ పాలనే బాగుందన్నారు.
10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ పురోగతిస్తే.. నేడు తిరుగమనంలో నడుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని.. ఉద్యోగులు, నిరుద్యోగులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన తర్వాత ఇంకా బెటర్ పాలన కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని ఆరోపించారు.
►ALSO READ | డబుల్ బెడ్ రూం కాలనీల్లో షాపుల వేలం..36 కాలనీల్లో 1400 షాపులు
ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజాహితంగా కార్యక్రమాలు అమలు చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభ్వుతంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ అని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారమైంది కేసీఆర్‌తోనే. దీన్ని ఎవరు విస్మరించలేరని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలనుకుంటున్నారన్నారు.
