పుణెలో ఫాక్స్‌‌‌‌కాన్ ప్లాంట్​

పుణెలో ఫాక్స్‌‌‌‌కాన్ ప్లాంట్​

న్యూఢిల్లీ: చిప్‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను  తయారు చేసే ఫాక్స్‌‌‌‌కాన్ మహారాష్ట్రలో భారీగా ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర  ప్రభుత్వంతో ఆదివారం చర్చలు జరిపింది. ‘ గ్లోబల్‌‌‌‌ స్థాయిలోని ఎలక్ట్రానిక్స్‌‌‌‌, సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ నిర్మిస్తుంది’ అని  మహారాష్ట్ర గవర్నమెంట్‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. పుణెలో  ఈ  ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు వేదాంత, ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంఓయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.