- ఇంటర్, ఆపై చదివిన వారు అర్హులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్లో ఏఐ అండ్ లైఫ్ స్కిల్ ట్రైనింగ్ ను ఈ నెల 21, 22, 25, 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. యువత టెక్నాలజీ స్కిల్స్ డెవలప్ చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 18 నుంచి 30 ఏండ్ల వయస్సున్న ఇంటర్, ఆపైన చదివిన నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, క్యాస్ట్, స్టడీ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, జిరాక్స్ లతో 20న మధ్యాహ్నం 2 గంటల లోపు సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీ రోడ్ నెం 8 లో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్ ఆఫీసులో నమోదు చేసుకోవాలన్నారు. సమాచారం కోసం 040 24071178, 7780339322 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
