ఇవాళ(జులై 24) జర్నలిస్టు కుటుంబాలకు నిమ్స్లో హెల్త్ క్యాంప్

ఇవాళ(జులై 24) జర్నలిస్టు కుటుంబాలకు నిమ్స్లో హెల్త్ క్యాంప్

పంజాగుట్ట, వెలుగు: జర్నలిస్టు కుటుంబాలకు నిమ్స్ లో శుక్రవారం ప్రత్యేక హెల్త్​ క్యాంప్​నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్​ప్రెస్​క్లబ్​అధ్యక్షుడు విజయ్​కుమార్​రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

నిమ్స్, హైదరాబాద్ ప్రెస్​క్లబ్​సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంపులో ఉదయం 11 గంటల నుంచి ఉచితంగా వివిధ వైద్య పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.