రోగం నయమయ్యేదాకా పేషెంట్లకు ఉచిత  మందులు

రోగం నయమయ్యేదాకా పేషెంట్లకు ఉచిత  మందులు

హైదరాబాద్, వెలుగు:  రోగం పూర్తిగా నయమయ్యేదాకా పేషెంట్లకు  మందులు ఉచితంగానే అందజేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ దవాఖాన్ల నుంచి రోగిని డిశ్చార్జ్ చేసే టైంలో అన్ని మెడిసిన్లను ఇవ్వాలని పేర్కొన్నారు.

ఫాలోఅప్‌‌ టైమ్‌‌లో రాసిన మందులను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం ఇన్‌‌ పేషెంట్లకు మాత్రమే మందులు ఉచితంగా అందజేస్తున్నారు. డిశ్చార్జ్ సమయంలో ప్రైవేటుగా కొనుక్కోవాలని సూచిస్తున్నారు. సర్కార్ నిర్ణయంతో పేదవారికి మేలు చేకూరే అవకాశం ఉంది.