పోస్టాఫీసు కొత్త సర్వీస్..క్యాష్ కూడా డోర్ డెలివరీ చేస్తుందట

పోస్టాఫీసు కొత్త సర్వీస్..క్యాష్ కూడా డోర్ డెలివరీ చేస్తుందట

ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ లో దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే..క్యాష్ తో పనిలేకుండా ఆన్ లైన్ పేమెంట్స్, క్యూర్ కోడ్ స్కాన్ ద్వారా చెల్లింపు వం టి డిజిటల్ మార్గాల్లో లావాదేవీలు సాగుతున్న విషయం మనకు తెలిసిందే..నగదు కావాలనుకుంటే ఏటీఎంలకు, పెద్ద మొద్ద మొత్తం అయితే బ్యాంకులకు వెళ్తుం టాం.. అయితే ఇటీవల పోస్టాఫీసుల్లో వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. చిన్న మొత్తాలను బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నగదు పొందేలా బయోమెట్రిక్ ద్వారా నిర్వహించే సర్వీస్ ను అందిస్తుంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్(ఏఈపీఎస్)  ద్వారా సాగే ఈ నగదు ఉపసంహరణ ఎలా చేస్తారో తెలుసుకుందాం.  

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ (ఏఈపీఎస్)  అంటే.. 

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ (ఏఈపీఎస్)  అంటే ఆధార్ బయోమెట్రిక్ ద్వారా నగదు పొందే సర్వీస్.. దీని సాయంతో బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేయొచ్చు. బ్యాలెన్స్ వివరాలు, నగదు విత్ డ్రా, రెమిటెన్స్ లావాదేవీలు చేయొచ్చు. తక్కువ అమౌంట్ (నగదు) అవసరం పడిన వాళ్లు బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండా ఇంటి వద్దనుంచే విత్ డ్రా చేయొచ్చు. 

ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవడం ఎలా 

దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకుల్లోనూ ఏఈపీఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తుల బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు మీ ఫోన్ నంబర్ కు లింక్ అయి ఉండా. ఏఈపీఎస్ డోర్ స్టెప్ లావాదేవీని సెలక్ట్ చేసుకున్నప్పుడు బయోమెట్రిక్ సాయంతో మీ క్యాష్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ డోర్ స్టెబ్ సర్వీస్ కు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10 వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ సర్వీస్ ను వినియోగించుకోవాలంటే సర్వీస్ రిక్వెస్ట్ ఫారంలో వివరాలు తప్పనిసరిగా పొందు పర్చాలి. పేరు, చిరునామా, మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీసు వివరాలు రాయాలి.