ఓటు వేయండి.. ఫ్రీగా టిఫిన్ తినండి.. సినిమా టికెట్లు తీసుకోండి

ఓటు వేయండి.. ఫ్రీగా టిఫిన్ తినండి.. సినిమా టికెట్లు తీసుకోండి

లోక్‌సభ ఎన్నికలకు  మొత్తం ఏడు దశల పోలింగ్ లో మూడు ఫేజ్ లు పూర్తి అయిపోయాయి.  అయితే ఈ  మూడు ఫేజ్ లలో తక్కువు ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యింది. మొదటి ఫేజ్ లో 66.14 శాతం, రెండో ఫేజ్ లో 66.71 శాతం, థర్డ్ ఫేజ్ లో 65.68 శాతం పోలింగ్ నమోదయ్యింది.  గత ఎన్నికలతో పోల్చితే ఇది చాలా తక్కువ.  

లోక్ సభ ఎన్నికలకు ఇంకా నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.   మే 13, మే 20, మే 25 జూన్ 1న జరగనున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులతోపాటు, స్థానిక అధికారులు  తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.  ముఖ్యంగా నగరాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.    ఈ క్రమంలోనే ఓటు వేసి వచ్చిన వారికి  రెస్టారెంట్లు, పలు హోటళ్లు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్టీ ,ఇతర ఆహారా పధార్థాలను అందిస్తున్నాయి. 

 ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో  మే 13న ఓటు వేయనున్న ఓటర్లకు మూడు రోజుల పాటు ఫ్రీజర్నీ కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో పాటు టీ షర్టులు, క్యాప్‌ల కోసం పోలింగ్ బూత్‌ల వద్ద లక్కీ డ్రాలు కూడా వేస్తున్నారు. అలాగే   ఇండోర్‌లోని వ్యాపార సంఘాలు, ఓటర్లు, సిరా వేసిన వేలు చూపిస్తే ఉచిత అల్పాహారం పోహా, జిలేబీ , పాథాలజీ ల్యాబ్‌లలో  ఆఫర్లు  ఇస్తామని  ప్రకటించాయి.

గురుగ్రామ్‌లో సినిమా టిక్కెట్‌లపై డిస్కౌంట్‌లు

గురుగ్రామ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మే 25 (శనివారం) లోక్‌సభ ఎన్నికలలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి గురుగ్రామ్ జిల్లా యంత్రాంగం పలు  మల్టీప్లెక్స్ చైన్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఓటు వేసి వచ్చిన వారికి  సినిమా టిక్కెట్లు , ఆహార పదార్థాలపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఆఫ్‌లైన్ టిక్కెట్‌లపై లేదా సినిమా హాల్ ఆవరణలో లభించే ఆహారం,  కూల్ డ్రింక్ లపై డిస్కౌంట్  పొందడానికి ఓటరు పోలింగ్ రోజున తన సిరా వేసిన వేలును చూపించాలి. 

ముంబై మెట్రో ప్రత్యేక ఆఫర్

మే 20న జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నంలో, మెట్రో లైన్లు 2A ,   7లోని ప్రయాణికులు ఓటింగ్ రోజున ప్రత్యేక 10 శాతం ఆఫర్ అందిస్తున్నారు. ముంబై మెట్రో ప్రయాణికులు 1 కార్డ్, పేపర్ క్యూఆర్, పేపర్ టిక్కెట్‌లను ఉపయోగించి పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లి ఓటు వేసిన తర్వాత ఇంటికి తిరిగి రావడానికి  బేస్ ఛార్జీపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ను  ప్రకటించారు.