
బెంగళూర్ ఎలక్ట్రానిక్ సిటీలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో జరిగిన ఈ రేవ్ పార్టీలో మద్యంతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుబడింది. తెల్లవారుజామున 3 వరకు జరిగిన ఈ రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో దాడులు చేశారు పోలీసులు. అంతేకాదు.. పార్టీ జరిగిన జీఆర్ ఫామ్‌హౌస్ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డి దిగా పోలీసులు గుర్తించారు.
ఇక ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు తెలిపారు. అందులో సినీ నటి హేమ పేరు కూడా వినిపించింది. అయితే ఈ కేసులో తనపేరు వినిపించడంపై స్పందించారు హేమ.. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగళూర్ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాగుతున్నారు. నాగురించి కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అని తెలిపారు హేమ.