నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ

నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ

బాల్కొండ, వెలుగు : అన్నమాచార్య 616 జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన నాట్య ప్రదర్శనలో బాల్కొండ కేటీఎస్ చిన్నారులు ఆదివారం ఉత్తమ ప్రతిభ కనబర్చారు.  రవీంద్ర భారతిలో బాల్కొండ శివం డాన్స్ అకాడమీ నిర్వహించిన ప్రదర్శనలో అగ్రతి, సాత్విక, మేక కీర్తన, మనస్విని, సహస్ర,  శ్రీ మహేశ్వరి, వీక్షణ, మిథున, నిత్యశ్రీ, ప్రవస్తి, నైనిక ప్రతిభ చూపారు.