IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్  గాయపడ్డాడు. తొలి రోజు ఆటలో భాగంగా చేతి వేలికి గాయమైంది. దీంతో పంత్ గాయం కారణంగా గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. బుమ్రా వేసిన 34 ఓవర్ రెండో డెలివరీ పంత్ ఎడమ చేతి వేలికి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడడంతో ఫిజియో వచ్చి స్ప్రేను తన చేతి వేలికి చల్లాడు. నొప్పి తగ్గకపోవడంతో పంత్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చాడు. రెండో రోజు పంత్ గాయం నుంచి కోలుకోకపోవడంతో వికెట్ కీపింగ్ చేయడానికి జురెల్ బరిలోకి దిగాడు. 

పంత్ గాయంపై ఎలాంటి అప్ డేట్ లేదు. రెండో రోజు టీమిండియా బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంత్ బ్యాటింగ్ ఆడకపోతే పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పంత్ బ్యాటింగ్ చేయలేకపోతే అతని స్థానంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ధృవ్ జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం పంత్ బ్యాటింగ్ చేయడానికి రాలేకపోతే అతని స్థానంలో జురెల్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఐసీసీ ప్రస్తుత టెస్ట్ రూల్స్ ప్రకారం, ఒక ఆటగాడు కంకషన్ కు గురైనప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయం ఆటగాడిని భర్తీ చేయగలడు. 

ALSO READ : IND vs ENG 2025: 7 బంతుల్లో 3 వికెట్లు.. ఇంగ్లాండ్‌ను బెంబేలేత్తిస్తున్న బుమ్రా

పంత్ గాయం అతని చేతికి సంబంధించింది. తలకు సంబంధించినది కాదు. కాబట్టి జురెల్ ఫీల్డింగ్ ప్రత్యామ్నాయం మాత్రమే. అతను  కీపింగ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. బ్యాటింగ్ చేయడానికి అర్హత లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ లో పంత్ బ్యాటింగ్ కు రాకపోతే టీమిండియాపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. సూపర్ ఫామ్ లో ఉన్న పంత్ త్వరగా కోలుకోని బ్యాటింగ్ కు రావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తొలి టెస్టులో రెండు సెంచరీలు కొట్టి అదరగొట్టిన పంత్ రెండో రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు.