IND vs ENG 2025: 7 బంతుల్లో 3 వికెట్లు.. ఇంగ్లాండ్‌ను బెంబేలేత్తిస్తున్న బుమ్రా

IND vs ENG 2025: 7 బంతుల్లో 3 వికెట్లు.. ఇంగ్లాండ్‌ను బెంబేలేత్తిస్తున్న బుమ్రా

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా  చెలరేగాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ ను వణికించాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. 7 బంతుల వ్యవధిలో ప్రమాదకర స్టోక్స్ (44), రూట్ (103) లతో పాటు వోక్స్(0)ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. క్రీజ్ లో కార్స్ (8), జెమీ స్మిత్ (12) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. నితీష్ రెండు.. జడేజాకు ఒక వికెట్ తీసుకున్నారు. 

విజృంభించిన బుమ్రా:

251 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించలేదు. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన రూట్, స్టోక్స్ జోడీని విడగొట్టి టీమిండియాకు బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. 86 ఓవర్ రెండో బంతికి ఒక ఇన్ స్వింగ్ తో స్టోక్స్ (44) ను బుమ్రా బోల్తా కొట్టించాడు. 88 ఓవర్ తొలి బంతికి సెంచరీ హీరో రూట్ ఔటయ్యాడు. బుమ్రా బంతిని డ్రైవ్ చేయాలనీ భావిస్తే ఇన్స్ సైడ్ ఎడ్జ్ తీసుకొని క్లీన్ బౌల్డయ్యాడు.

Also Raed : లార్డ్స్ టెస్టులో రూట్ సెంచరీ

 ఆ తర్వాత బంతికే వోక్స్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొదట వోక్స్ ను అంపైర్ నాటౌట్ అని ప్రకటించినా.. టీమిండియా రివ్యూ తీసుకొని సఫలమైంది. హ్యాట్రిక్ తీసే అవకాశం లభించినప్పటికీ కార్స్ బుమ్రాకు ఆ అవకాశం ఇవ్వలేదు.