
బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రామచందర్ రావుపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామ్ చందర్ రావు హెచ్ సీయూకి వెళ్లి రోహిత్ వేములపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రామచందర్ రావు రోహిత్ ను సస్పెండ్ చేయించారని.. ఆ వేధింపులు తట్టుకోలేకనే రోహిత్ వేములు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు భట్టి. అలాంటి రామ్ చందర్ రావును బీజేపీ అధ్యక్షునిగా నియమించడం సరికాదన్నారు . దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచించాలన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని చెప్పారు. దళితులు,ఆదివాసులంటే బీజేపీకి గౌరవం లేదన్నారు భట్టి.
రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు భట్టి. రోహిత్ వేముల కేసును మళ్లీ విచారణ చేపట్టేందుకు కోర్టుకు వెళ్లామని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామన్నారు. ఈ దేశంలో పుట్టిన దళిత గిరిజనులు కూడా ఈ దేశంలో నివసించే హక్కు ఉందన్నారు. సమానత్వంతో బతికే హక్కులు రాజ్యాంగం కల్పించిందన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు దేశ ప్రజలందరికీ బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పార్టీ అధ్యక్షుల ఎంపికకు అర్హత దళిత, గిరిజనులను వేధించడమేనని తెలిపారు.
►ALSO READ | రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్