
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేయటం.. బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధం అయ్యారు. తెలంగాణ బీజేపీలోని పరిణామాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. తన రాజీనామా లేఖను బీజేపీ హైకమాండ్ కు పంపించారు. వారం రోజుల తర్వాత.. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. ఈ మేరకు 2025, జూలై 11వ తేదీన బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
►ALSO READ | మల్నాడు డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డ్రగ్స్ సప్లై చేసే నైజీరియా యువతులకు రూ.3 వేల కమీషన్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ఈ మేరకు శుక్రవారం (జులై 11) లేఖను విడుదల చేసింది పార్టీ అధిష్టానం. గత కొంత కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్న రాజాసింగ్.. ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను సమర్పించారు. రాజాసింగ్ ఇచ్చిన లేఖను పార్టీ హైకమాండ్ కు పంపారు కిషన్ రెడ్డి. దీంతో పార్టీ హైకమాండ్ రాజీనామా లేఖను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ అధిష్టానంపై సీరియస్ గా ఉన్న రాజాసింగ్.. పరోక్షంగా పార్టీనేతలపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల స్టేట్ చీఫ్ పదవికి నామినేషన్ ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నిక చేయడానికి వ్యతిరేకిస్తూ రాజాసింగ్ రాజీనామా చేశారు. పార్టీ సిద్ధాంతాలకు రాజాసింగ్ వ్యవహారం బాగాలేదన్న హైకమాండ్ ఆయన రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాజాసింగ్ గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చా.. కానీ అనుచరులను బెదిరించారని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేశానని.. రిజైన్ లెటర్‌ను కిషన్ రెడ్డికి అందజేశానని తెలిపారు.
పార్టీ అధ్యక్ష పదవి కోసం నాకు ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్ మద్దతుగా సంతకం పెట్టారని.. వాళ్లను కూడా బెదిరించారన్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు కేవలం నామామాత్రమేనని.. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావొద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన వారిందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.