మల్నాడు డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డ్రగ్స్ సప్లై చేసే నైజీరియా యువతులకు రూ.3 వేల కమీషన్

మల్నాడు డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డ్రగ్స్ సప్లై చేసే నైజీరియా యువతులకు రూ.3 వేల కమీషన్

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన  కొంపల్లి మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో   కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెస్టారెంట్ నిర్వాహకులు నైజీరియా యువతి ద్వారా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు బయటపడింది. డ్రగ్స్ సప్లై చేసేందుకు  మల్నాడ్ కిచెన్ యజమాని సూర్య నైజీరియా యువతులకు వెయ్యి నుంచి రూ.3వేలు కమిషన్  ఇస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మల్నాడు కిచెన్ నుంచి సిటీలోని పలు పబ్స్, హోటల్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. 

ఈ కేసులో మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ను నార్కోటిక్ బ్యూరో  వారం రోజులు కస్టడీ కి కోరనున్న ట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న నైజీరియన్స్ ను డిపోర్టేషన్  చేస్తున్నారు HNEW విభాగం అధికారులు. హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై , విక్రయాలకు నైజేరియన్ యువతులతో డ్రగ్స్ ముఠా దందా చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్.. నైజీరియన్స్ ను తిరిగి వాళ్ల దేశానికి పంపించే పనిలో ఉన్నారు.

నైజీరియా యువతలకు కమీషన్ ఆశ చూపించి డ్రగ్స్ దందా, వ్యభిచారం చేయిస్తున్నట్లు  ఈగల్ (నార్కోటిక్ బ్యూరో) విచారణ లో వెల్లడైంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ లో 60 మంది నైజీరియా యువతులు ఏజెంట్లు గా పని చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండేళ్ల లో 19 మందిని వారి దేశాలకి తిప్పి పంపారు. అందులో 6 గురు యువతులు ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసులో ఎక్కువగాపట్టబడుతుండటంతో  నైజీరియన్లను వీలైంత వరకు వాళ్ల దేశం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.