IND vs ENG: ఇక మిగిలింది ఇషాంత్ ఒక్కడే: భారత దిగ్గజం కపిల్ దేవ్ 2 రికార్డులు బద్దలుకొట్టిన బుమ్రా

IND vs ENG: ఇక మిగిలింది ఇషాంత్ ఒక్కడే: భారత దిగ్గజం కపిల్ దేవ్ 2 రికార్డులు బద్దలుకొట్టిన బుమ్రా

బ్రిటన్: ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లతో రాణించిన బుమ్రా.. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో ఇంగ్లాండ్‌ గడ్డపై భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (46) తీసిన రెండో బౌలర్‎గా రికార్డ్ క్రియేట్ చేశాడు బుమ్రా. తద్వారా టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డ్‎ను బద్దలు కొట్టాడు బుమ్రా. ఇంగ్లాండ్‎లో 13 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు కపిల్ దేవ్. లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‎లో ఈ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. 

మూడో టెస్ట్‎లో ఫైఫర్ సాధించిన బుమ్రా.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో ఇప్పటి వరకు 46 వికెట్లు సాధించాడు. ఇంగ్లాండ్‎లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్ క్రికెటర్ ఇషాంత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు 15 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు లంబు. బుమ్రా మరో 6 వికెట్లు తీస్తే ఇషాంత్ రికార్డ్ కూడా బ్రేక్ అవుతోంది. బుమ్రా అద్భుత ఫామ్‎లో ఉండటంతో ఈ సిరీస్‎లోనే ఇషాంత్ రికార్డ్ బద్దలు అయ్యే అవకాశం ఉంది. 

►ALSO READ | IND vs ENG 2025: సిరాజ్‌కు సలాం.. చనిపోయిన ఫుట్ బాల్ స్టార్‌కు నివాళులు

ఇదే మ్యాచులో బుమ్రా మరో రికార్డ్ కూడా నెలకొల్పాడు. విదేశీ గడ్డపై భారత్ తరుఫున టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‎గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్ 12 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‎లో 5 వికెట్లు తీయడం ద్వారా కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేశాడు బుమ్రా. దీంతో పాటుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ రికార్డును అధిగమించాడు బుమ్రా. డబ్ల్యూటీసీలో అశ్విన్ 11 సార్లు ఫైఫర్ సాధించగా.. 12 సార్లు ఐదు వికెట్లు పడగొట్టి అశ్విన్ రికార్డును తుడిచిపెట్టాడు బుమ్రా. 

ఇంగ్లాండ్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు:

1 - ఇషాంత్ శర్మ : 15 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు

2 - జస్‌ప్రీత్ బుమ్రా: 11 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు

3 - కపిల్ దేవ్: 13 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు

4 - మహ్మద్ షమీ : 14 మ్యాచ్‌ల్లో 42 వికెట్లు

5 - అనిల్ కుంబ్లే: 10 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు