
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో పోర్చుగీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్ డియోగో జోటాకు సిరాజ్ తన నివాళులు అర్పించాడు. మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ను ఔట్ చేసి తన వేళ్లతో '20' సంఖ్యను సూచించాడు. ఆ తర్వాత తన రెండు చేతులను ఆకాశం వైపుకు డియోగో జోటాకు చూపించి ఈ వికెట్ తనకు అంకితం ఇచ్చాడు. దీంతో సిరాజ్ కు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ మ్యాచ్ లో సిరాజ్ కు ఇదే తొలి వికెట్. అంతకముందు సిరాజ్ బౌలింగ్ లో జెమీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రాహుల్ మిస్ చేశాడు. అయితే లంచ్ తర్వాత స్మిత్ వికెట్ సిరాజ్ తీసుకోవడం విశేషం. చివర్లో కార్స్ వికెట్ పడగొట్టిన సిరాజ్.. ఇంగ్లాండ్ ఇనింగ్స్ ను ముగించాడు. లివర్‌పూల్ స్టార్, పోర్చుగీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్ డియోగో జోటా (28) గురువారం (జూలై 3) కారు ప్రమాదంలో మరణించడం ప్రపంచ క్రీడా చరిత్రలో విషాదకర రోజుగా మిగిలింది. స్పెయిన్‌లోని జమోరా నగరంలో జరిగిన ఈ ప్రమాదంలో అర్ధరాత్రి 12:40 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి మంటల్లో చిక్కుకుంది.
►ALSO READ | MLC 2025: బంతితో కాదు బ్యాట్‌తో కొట్టాడు.. బోల్ట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ వెనుక హార్దిక్ హస్తం
విషాదకరమైన విషయం ఏంటంటే డియోగో జోటా కొద్దీ రోజుల క్రితమే తన చిన్ననాటి స్నేహితురాలు రూట్ కార్డోసోను పెళ్లి చేసుకున్నాడు. వింబుల్డన్ 148 సంవత్సరాల సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఇటీవలే శుక్రవారం (జూలై 4) జోటా మరణానికి నివాళులు అర్పిస్తూ ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్‌లు లేదా రిబ్బన్‌లను ధరించడాలని కోరింది. వింబుల్డన్ సంప్రదాయం ప్రకారం ఈ మెగా టోర్నీకి ప్లేయర్లు అందరూ వైట్స్ లోనే కనిపించాలి. డ్రెస్ కోడ్, షూస్, స్కార్ఫ్, ఇలా ఆటగాళ్లు ఆడే వస్తువులన్నీ వైట్ కలర్ లోనే ఉండాలనే రూల్ ఉంది. అయితే ఫుట్ బాల్ ప్లేయర్ డియోగో జోటా కోసం టోర్నమెంట్ చరిత్రలో తొలిసారి రూల్స్ మార్చడానికి సిద్ధమైంది.
Mohammed Siraj pays tribute to Diogo Jota ❤️
— Premier League India (@PLforIndia) July 11, 2025
@LFC | @StarSportsIndia pic.twitter.com/1XemOahFKj