హోమ్ వర్క్ చేయలేదని స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి.. 

హోమ్ వర్క్ చేయలేదని స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి.. 

స్కూల్ అన్నాక పిల్లల అల్లరి, టీచర్స్ కొట్టడం కామన్. బెత్తం దెబ్బలు తినని స్టూడెంట్ ఉండడు, పిల్లల్ని నాలుగు దెబ్బలు తగిలించని టీచర్ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి, ఒకప్పుడు పిల్లల్ని కొట్టైనా సరే దారిలో పెట్టమని చెప్పిన పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని మందలించినా కూడా ఒప్పుకోవట్లేదు. హోమ్ వర్క్ చేయలేదని అమ్మాయిని కొట్టినందుకు టీచర్ కి మూడేళ్ళ జైలు శిక్ష పడిన ఘటన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

ALSO READ : లూడో గేమ్ అనుకున్నా.. డెత్ గేమ్ అనుకోలేదు

2020లో గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ స్కూల్లో హోమ్ వర్క్ చేయని కారణంగా 9వ తరగతి విద్యార్థిని ని కొట్టింది ఓ టీచర్. దీంతో ఆ అమ్మాయి కర్ణభేరి దెబ్బతినింది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించారు అమ్మాయి పేరెంట్స్. ఐదేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిపిన గాంధీనగర్ కోర్టు ఇటీవలే తీర్పు వెల్లడించింది. టీచర్ కు మూడేళ్ళ మూడు నెలల జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తు తీర్పు వెల్లడించింది కోర్టు.

ALSO READ : 36 ఏళ్ల వ్యాపారవేత్తను కొట్టి చంపిన ఫుడ్ డెలివరీ బాయ్స్

కేసు విచారణ జరుగుతున్న సమయంలో టీచర్ రాజీకి ప్రయత్నించగా అమ్మాయి పేరెంట్స్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. టీచర్ కొట్టడంతో అమ్మాయి పూర్తిగా వినికిడి కోల్పోయిందని.. ఈ కారణంగా తమ కూతురు తీవ్ర మానసిక క్షోభకు గురైందని అంటున్నారు పేరెంట్స్. మొత్తానికి స్కూల్లో నాలుగు గోడల మధ్య రొటీన్ గా జరిగే సీన్ లో ఒక అమ్మాయి వినికిడి కోల్పోతే.. టీచర్ ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.