వరుస సినిమాలతో బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించిన హీరో సందీప్ కిషన్ ఇప్పుడు ఓటీటీపై కూడా తన దృష్టి సారించాడు. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మాన్ 2’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న సందీప్ కిషన్, ఇప్పుడు లీడ్ రోల్‌లో ఓ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమయ్యాడు.
‘సూపర్ సుబ్బు’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌లో, మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ శర్మ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.‘టిల్లు స్క్వేర్’ ఫేమ్ మల్లిక్ రామ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్, నెట్‌ఫ్లిక్స్ డైరెక్ట్ రిజినల్ సిరీస్గా రూపొందుతుంది.
లేటెస్ట్గా ‘సూపర్ సుబ్బు’ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ టీచర్ నేర్చుకోవడానికి, నేర్పడానికి వస్తున్నాడు” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ టీజర్ విడుదల చేసింది. టీజర్ విషయానికి వస్తే.. శృంగారంపై అవగాహనా కల్పించేలా ఈ సిరీస్ ఉంది. కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని కలగలసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిరేపుతోంది.
►ALSO READ | ఎర్రచీర సినిమా థియేటర్ల లో ప్రతి షోకి లక్కీ డ్రా
పాత్రల్లోని ఎక్సయిట్‌మెంట్, కథలోని కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించింది. పంచులు, సింగిల్ లైనర్లతో అదిరిపోయింది. ఇందులో కొడుకు చేసే పనులు నచ్చని తండ్రిగా, ఉపాధ్యాయుడిగా మురళీశర్మ కనిపించారు. ‘వాడికి పెళ్లి చేస్తే అంతా మంచి జరుగుతుందన్నావ్. మన సార్‌ను 60 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారు’ అంటూ నవ్వులు పూయించారు.
కథ కొర్ పాయింట్ విషయానికి వస్తే..
A ఎడ్యుకేషన్ టీచర్‌గా హీరో సందీప్ నటించాడు. తండ్రిగా, ఉపాధ్యాయుడిగా మురళీశర్మ కనిపించారు. గవర్నమెంట్ ఉద్యోగం లేక కుమారుడికి వచ్చిన పెళ్లి సంబంధాలు కుదరక పోవడంతో తండ్రి సందీప్ ను పదే పదే చివాట్లు పెడుతుంటాడు.
ఈ క్రమంలోనే చివరకు ఓ జాబ్ సంపాధించుకోగా.. దానిని పర్మినెంట్ చేసుకోవడం కోసం మాకీపూర్ అనే ఊరిలో అడుగుపెడతాడు. అక్కడ అడ్డగోలుగా పెరుగుతున్న జనాభాను తగ్గించేందుకు ఆ గ్రామ ప్రజల్లో అవగాహన తీసుకు వచ్చే డ్యూటీ సుబ్బుకు పడుతుంది.
ఇక అక్కడికి వెళ్లిన సుబ్బుకు అక్కడి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? జనాభాని తగ్గించుకోవడం కోసం సుబ్బు ఎలా నెట్టుకొచ్చాడనే అనేది మిగతా కథ! అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సిరీస్‌లో సందీప్ కిషన్‌కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది.
