కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే మీకే డబ్బులు మిగులుతాయి..

కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే మీకే డబ్బులు మిగులుతాయి..

మీ కారుకి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకుంటే ప్రతి ఏడాది చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీ కారుకి ఇన్సూరెన్స్ చూపిస్తే ఎంత అవుతుందనేది మీరు ఎలా డ్రైవ్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, మీ వయస్సు, కారు మోడల్, కారును ఎలా వాడతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పెద్ద కవరేజీ మిస్ అవకుండా  కొన్ని చిన్న వాటితో ప్రీమియం తగ్గించుకోవచ్చు. ఈ  టిప్స్ ద్వారా తక్కువ ఖర్చుతో మంచి కార్ ఇన్సూరెన్స్ ఎలా పొందాలి అంటే... 

మీకు సొంత కారు ఉంటే దానికి మంచి ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. మీకు ప్రతి ఏడాది కట్టే ప్రీమియం ఎక్కువ అనిపించినా సరే  కొన్ని ప్రమాదాల నుంచి మీ డబ్బు కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం. అయితే, ప్రతిసారీ రెన్యూవల్ ఫీజు ఎక్కువ అని బాధపడాల్సిన పని లేదు.  కార్ ఇన్సూరెన్స్ ఖర్చును పెంచే  విషయాలు తెలుసుకుని, కొన్ని పనులు  అలోచించి చేస్తే కారు బీమా ప్రీమియం తగ్గించుకోవచ్చు.

కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవడానికి ఈజీ టిప్స్ : నో క్లెయిమ్ బోనస్ (NCB) : గత ఏడాది మీరు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు కొంత డిస్కౌంట్ ఇస్తుంది. దీన్ని నో-క్లెయిమ్ బోనస్ అంటారు. క్లెయిమ్‌ చేయకుండా ఏళ్లు గడిచేకొద్దీ ఈ డిస్కౌంట్ పెరుగుతుంది, మీ ఓన్-డ్యామేజ్ ప్రీమియంపై 50% వరకు ఆదా చేసుకోవచ్చు. చిన్న చిన్న నష్టాలకు మీరే కట్టడం వల్ల ఈ బోనస్ కోల్పోకుండా ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చిన NCB అలాగే ఉంటుందని  గుర్తుంచుకోండి.

రెన్యూవల్ ముందు వేరే పాలసీలు చూడడం: మీ ప్రస్తుత కంపెనీ పాలసీని ఆటోమేటిక్‌ రెన్యూవల్ చేయకండి. ఎందుకంటే ఇతర కంపెనీల పాలసీలను కూడా చూడండి.  కార్ ఇన్సూరెన్స్ మార్కెట్లో వేర్వేరు కంపెనీలు ఒకే కవరేజీని వేర్వేరు ధరలు, బెనిఫిట్స్ అందిస్తాయి.  

రోడ్డుపై జాగ్రత్త: మీ డ్రైవింగ్ రికార్డు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై చాలా ఎఫెక్ట్ చూపుతుంది. మీకు ఎలాంటి ప్రమాదాల హిస్టరీ లేకుంటే తక్కువ రిస్క్ ఉన్న డ్రైవర్ అని అర్థం. దీనివల్ల కారు ఇన్సూరెన్స్ పై మంచి డిస్కౌంట్స్  పొందవచ్చు, మీ నో క్లెయిమ్ బోనస్ కూడా పెరుగుతుంది.  

యాంటీ థెఫ్ట్ డివైజెస్: మీ కారులో ఇమ్మొబిలైజర్లు, అలారం సిస్టమ్‌ వంటి యాంటీ-థెఫ్ట్ గాడ్జెట్‌లు పెట్టడం వల్ల దొంగతనాల నుండి కాపాడుతుంది. ఇలాంటి వాహనాలు దొంగతనం జరిగే అవకాశం తక్కువ. ఎందుకంటే దొంగతనానికి సంబంధించి బీమా కంపెనీ ఇచ్చే మొత్తం తక్కువ ఉండొచ్చు. అందుకే, చాలా బీమా సంస్థలు యాంటీ-థెఫ్ట్ డివైజెస్ ఉన్న కార్లకు ప్రీమియం తగ్గిస్తాయి.

కొన్ని బీమా కంపెనీలు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలనికి పాలసీలను ఇస్తుంటాయి, సాధారణంగా రెండు లేదా మూడు సంవత్సరాలు. మీరు ప్రతి ఏడాది రెన్యూవల్ చేసే అవసరం లేకుండా  ఈ రకం ఇన్సూరెన్స్ తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు.  

మీ కారు మోడల్, రకం మీ బీమా ఖర్చులపై చాలా ప్రభావం చూపుతాయి. ఖరీదైన, ఎక్కువ పర్ఫార్మెన్స్  ఉన్న, మోడిఫై చేసిన మోడళ్లకు ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి. కొత్త కారు కొనే ముందు వివిధ కార్లకు బీమా ఖర్చు సుమారు ఎంత అవుతుందో తెలుసుకోండి.  

ALSO READ  : ఒక్క కారు.. ఒక్క ఫాస్ట్‌ట్యాగ్ మాత్రమే: చేతితో చూపిస్తాం అంటే ఇక కుదరదు.. అలాంటి ఫాస్ట్‌ట్యాగ్స్ బ్లాక్

 మీరు తక్కువగా డ్రైవ్ చేసేవారైతే లేదా మీరు సేఫ్  డ్రైవర్ అని చూపిస్తే మీ ప్రీమియం తగ్గుతుంది. ఎందుకంటే బీమా కంపెనీ మీ రిస్క్ ప్రొఫైల్, డ్రైవింగ్ ఆధారంగా ఖర్చు నిర్ణయిస్తుంది.