2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో.. కామారెడ్డి జిల్లా పోలీసులకు 11 పతకాలు

2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో.. కామారెడ్డి  జిల్లా పోలీసులకు 11 పతకాలు
  • అభినందించిన ఎస్పీ రాజేశ్​చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు: ఈ నెల 7,9 తేదీల్లో కరీంనగర్ లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్​లో  కామారెడ్డి జిల్లాకు 11 పతకాలు వచ్చినట్లు  ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు. పతకాలు సాధించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పతకాలు సాధించిన వారిలో  బి.ఆంజనేయులు ( ఎస్సై-గాంధారి),   కె.విజయ్ ( ఎస్సై- మద్నూర్​),  ఎస్.లక్ష్మీనారాయణ, ఎ.చిరంజీవి, పి.రామచంద్రం,  పి.ఎల్లారెడ్డి ఉన్నారు.  వృత్తి నైపుణ్యాన్ని గుర్తించేందుకు పోలీసు డ్యూటీ మీట్ దోహాదపడుతుందన్నారు.  సీఐలు సంతోష్​కుమార్, నవీన్​కుమార్ పాల్గొన్నారు.  

ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి 

సదాశివనగర్, వెలుగు: ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీసులు  పని చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు.  శుక్రవారం సదాశివనగర్ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్​ను ఎస్పీ తనిఖీ చేశారు.  రికార్డులను పరిశీలించి, అ ధికారులు, సిబ్బందితో మాట్లాడారు. డయల్ 100కు వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. చోరీలు జరగకుండా చూడాలని, డ్రంక్​ అండ్​ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్నారు.  

రెగ్యులర్​గా గ్రామాలను విజిట్​ చేయాలన్నారు. సైబర్ మోసాలు, మూఢనమ్మకాల నిర్మూలన, బాల్యవివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్​కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయవద్దన్నారు.  సీఐ సంతోష్​కుమార్, ఎస్సై పుష్పరాజ్ ఉన్నారు.