
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. జులై 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గంలోనే వాహనదారులు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.
బోనం సమర్పించనున్న సీఎం
జులై 13న సీఎం రేవంత్ రెడ్డి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్,దేవాదాయ శాఖ,పోలీస్ , జీహెచ్ ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన ప్రజల సహకారం అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేశామన్నారు. లష్కర్ బోనాలు చారిత్రాత్మక మైనవని చెప్పారు. ప్రజల మంచికొరకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలన్నారు.
►ALSO READ | HCA స్కాంలో రూ. 170 కోట్ల గోల్ మాల్ జరిగింది
తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగ సందడి కొనసాగుతోంది..రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బోనాల పండగ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జరుపుకుంటారు. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలతో నగరంలో అథ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. గోల్కోండ, లాల్ దర్వాజ, ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆదివారం జులై 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు వైన్స్ లు కూడా క్లోజ్ చేయాలని ఆదేశించారు.