
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న HCA స్కాంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి. HCA గతంలో ఉన్నట్లు లేదని.. అలా ఉండుంటే ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి ఒక క్రికెటర్ బయటికి వచ్చేవాడని అన్నారు గురువారెడ్డి. HCAలో ఇప్పటిదాకా సుమారు రూ. 170 కోట్ల స్కాం జరిగిందని అన్నారు గురువారెడ్డి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితం అయిందని అన్నారు.
HCA లో ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా అవినీతి జరుగుతుందని అన్నారు. బీసీసీఐ ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లకు వరకు ఇస్తుందని.. ఐపిఎల్ నిర్వహణకు HCA కు నిధులు వస్తాయని అన్నారు. విజిలెన్స్ వారు ఎంక్వారీ చేయడం.. తర్వాత సీఐడీ ఎంటర్ అవ్వడంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషులను శిక్షించారని అన్నారు. ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం డాక్యుమెంట్లు సృష్టించడం అంత బయటపడిందని అన్నారు.
జగన్ మోహన్ అనర్హుడని.. ఈసీ అతన్ని ఎలా పోటీ చేయించారని ప్రశ్నించారు గురవారెడ్డి. క్లబ్ లో ఉన్నవారు ఎందుకు సహకరించారని అన్నారు. బీసీసీఐ ఇచ్చే గ్రాంట్ గ్రౌండ్ ల అభివృద్ధి కి ,క్రీడాకారులకు ఉపయోగించాలి కానీ దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. జస్టిస్ నాగేశ్వర రావు చెప్పి వివరాల ప్రకారం అంతకముందు నేర చరిత్ర ఉన్నవాళ్ళని కూడా విచారించాలని అన్నారు. ఏ క్లబ్ కూడా సొంతంగా నడపట్లేదని.. ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారం ఉందా అని ప్రశ్నించారు.
ఈ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత హస్తం కూడా ఉందని.. తన బంధువు జగన్మోహన్ రావు కు అండగా ఎమ్మెల్సీ కవిత ఉందని అన్నారు గురువారెడ్డి. క్లబ్ లలో ఉన్న 217 మంది సభ్యులు అందరూ దొంగలే అని.. పబ్లిక్ కి సంబంధించిన కోట్ల రూపాయలు ఎలా వాడుకున్నారని ప్రశ్నించారు గురవారెడ్డి. దీని వెనక రాజకీయ నాయకులు ఎవరున్నా అన్ని బయట పెడతానని అన్నారు.