Allu Arjun: భార్యకు బెంజ్.. తల్లికి లెక్సస్.. ఐకాన్ స్టార్ రియల్ హీరో అనిపించుకున్నాడుగా!

Allu Arjun: భార్యకు బెంజ్.. తల్లికి లెక్సస్.. ఐకాన్ స్టార్ రియల్ హీరో అనిపించుకున్నాడుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నారు. తన తమ్ముడు శిరీష్ వివాహం సందర్భంగా కాస్త షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇటీవల తన భార్య స్నేహారెడ్డికి పెళ్లి రోజు ( మార్చి 6, 2026 ) సందర్భంగా ఖరీదైన కారును గిప్ట్ గా ఇచ్చి సర్పైజ్ చేశారు బన్నీ. లేటెస్ట్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( మార్చి 8 ) సందర్భంగా తన తల్లి అల్లు నిర్మల కి కూడా అదిరిపోయే కానుకను అందజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.

అమ్మ మీద ప్రేమతో.. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకోని అల్లు అర్జున్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళ అయిన తన తల్లికి లెక్సస్ (Lexus) బ్రాండ్‌కు చెందిన ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. దీని ధర మార్కెట్లో సుమారు 70 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం. కొత్త కారు ముందు తల్లి నిర్మల గారితో కలిసి బన్నీ దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "అమ్మంటేనే ప్రేమ.. ఆమెకు ఇచ్చే గౌరవానికి వెలకట్టలేం" అంటూ అల్లు అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

భార్యకు 'మెర్సిడెస్ బెంజ్' కానుక..

గత వారం అల్లు అర్జున్ - స్నేహారెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ తన 'క్యూటీ' (స్నేహ) కోసం సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన Mercedes-AMG CLE 53 కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. మొదట ఈ కారు వీడియో బయటకు వచ్చినప్పుడు, అది తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి కానుక అని అందరూ భావించారు. కానీ అది తన అర్ధాంగి కోసం బన్నీ ప్లాన్ చేసిన స్పెషల్ సర్ప్రైజ్ అని తర్వాత తెలిసింది.

►ALSO READ | Samantha : సల్మాన్ ఖాన్ సరసన సమంత.. రాజ్‌ & డీకే సూపర్ హీరో మూవీలో క్రేజీ కాంబినేషన్!

ఒకే రోజు రెండు వేడుకలు..

మార్చి 6వ తేదీ అల్లు కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఒకవైపు బన్నీ వెడ్డింగ్ యానివర్సరీ కాగా, అదే రోజు తమ్ముడు అల్లు శిరీష్, తన చిరకాల స్నేహితురాలు నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి పీటలెక్కింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సూర్య వంటి అగ్ర తారలతో పాటు రాజకీయ నేతలు హాజరై సందడి చేశారు.

వరుస సినిమాలతో బిజీ!

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సంచలన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో 'A22 x A6' (వర్కింగ్ టైటిల్) అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఒక సినిమా లైన్‌లో ఉంది.