Samantha : సల్మాన్ ఖాన్ సరసన సమంత.. రాజ్‌ & డీకే సూపర్ హీరో మూవీలో క్రేజీ కాంబినేషన్!

Samantha : సల్మాన్ ఖాన్ సరసన సమంత.. రాజ్‌ & డీకే సూపర్ హీరో మూవీలో క్రేజీ కాంబినేషన్!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్,  సూపర్ హిట్ ద్వయం రాజ్ అండ్ డీకేల కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్టు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ వార్త  బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  లేటెస్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి టాలీవుడ్ క్వీన్ సమంత ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింత జోరు పెంచి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది .

సల్మాన్ సరసన సమంత.. 

గతంలో రాజ్  అండ్  డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ,'సిటాడెల్: హనీ బన్నీ' వంటి సిరీస్‌లతో సమంత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దర్శకులతో ఆమెకున్న బలమైన అనుబంధం కారణంగా, సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే ఈ భారీ ప్రాజెక్టులో చిత్రంలో సమంతనే హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, సల్మాన్ ఖాన్, సమంత మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. ఒక పక్క సల్మాన్ మాస్ ఇమేజ్, మరోపక్క సమంత పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ధీమాతో ఉన్నారు మేకర్స్.

ALSO READ : సెన్సార్ కమిటీ ట్విస్ట్.. ‘జన నాయగన్’ రిలీజ్ మళ్లీ వాయిదా

 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' వాయిదా?

మరోవైపు సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పనుల్లో బిజీగా ఉన్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వార్ డ్రామాలో చిత్రంగాడ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బిజీగా సమంత... 

సమంత విషయానికొస్తే, ఆమె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం' మే 15న థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా, రాజ్ & డీకే నిర్మిస్తున్న 'రక్త బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్ సరసన ఆమె కనిపించనుంది. ప్రస్తుతం సల్మాన్ సరసన నటించే సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆగస్టు నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

సూపర్ హీరో ఫిల్మ్ కాన్సెప్ట్ లో

రాజ్ & డీకే కేవలం వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా, సల్మాన్ ఖాన్ వంటి మెగా స్టార్‌తో వెండితెరపై మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. వీరి కాంబోలో రాబోయే సూపర్ హీరో ఫిల్మ్ కాన్సెప్ట్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, సమంత పేరు వినిపించడంతో అంచనాలు రెట్టింపయ్యాయి .  ఇది ఒక సూపర్ హీరో థీమ్ తో కూడిన సినిమా అని సమాచారం. సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు పూర్తిస్థాయి సూపర్ హీరో పాత్ర చేయలేదు, అందుకే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.