
ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం పోలీసులకి షాకిచ్చింది. అంతేకాదు ఆశ్చర్యపోయే నిజాలు కూడా బయటపడ్డాయి. సమాచారం ప్రకారం స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి ఫోన్‌ని దొంగతనం చేసారు. దింతో అతను పోలీసులకి ఫిర్యాదు చేయగా, ఈ దొంగతనం వెనుక ఉన్నది అతని భార్యే అని, ఆమె తన వివాహేతర సంబంధాన్ని దాచిపెట్టేందుకే ఇలా చేసిందని తేలింది.
జూన్ 19న ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ సమీపంలో ఫోన్ చోరీ అయిందని పోలీసులకు సమాచారం అందింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అంకిత్ చౌహాన్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే పోలీసులు ఆ ప్రాంతంలోని దాదాపు 70 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో నీలిరంగు టీ-షర్ట్ ధరించిన ఓ వ్యక్తి స్కూటీపై ఉన్నట్లు గుర్తించారు. దర్యాగంజ్లో అద్దెకు తీసుకున్న స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను వసంత్ కుంజ్‌లోని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరా సహాయంతో పోలీసులు తెలుసుకున్నారు.
స్కూటీ అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఆధారంగా పోలీసులు రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని బలోత్రాకు వెళ్లి నిందితులలో ఒకడైన అంకిత్ గెహ్లాట్‌ను అరెస్టు చేశారు. అయితే అంకిత్ విచారణలో అసలు విషయాన్ని బయటపెట్టాడు.
బాధితుడి భార్య తనను దొంగతనం చేయమని చెప్పినట్లు, అలాగే ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అంకిత్ వెల్లడించాడు. తన భర్త ఫోన్‌లో తన లవరుతో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయని, వాటిని డిలీట్ చేయడానికి అతని ఫోన్ చోరీ చేయాలని ఆమె కోరినట్లు చెప్పాడు. తన భర్త రోజు ప్రకారం ఆఫీస్ టైం, అతను వెళ్ళే దారి వంటి వివరాలను కూడా ఆమె అంకిత్‌కు చెప్పింది. దొంగిలించిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు అంకిత్ నుండి స్వాధీనం చేసుకొని, అంకిత్‌తో పాటు బాధితుడి భార్యను కూడా అరెస్టు చేశారు.
ALSO READ : ఫోల్డబుల్ ఐఫోన్ వస్తుందా ? రియాలిటీకి దగ్గరగా డిస్ ప్లే.. త్వరలోనే ఛాన్స్ !
మీడియా కథనాల ప్రకారం, బాధితుడికి తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసని, ఆమె పడుకున్నప్పుడు ఆ ఫోటోలను తన ఫోన్‌లోకి షేర్ చేశాడని సమాచారం. చివరికి తన కుటుంబం ముందు ఈ విషయం బయటపడుతుందని భార్య భయపడి ఈ చోరీని ప్లాన్ చేసినట్లు వెల్లడైంది.