6 నెలల బిడ్డకు పాలు ఇస్తుండగా.. పెట్రోల్‌‌ పోసి నిప్పు పెట్టిన భర్త లవర్

6 నెలల బిడ్డకు పాలు ఇస్తుండగా..  పెట్రోల్‌‌ పోసి నిప్పు పెట్టిన భర్త లవర్

ప్రియుడి భార్యపై పెట్రోల్‌‌ పోసి చంపిన మహిళ
యువకుడితో వివాహేతర సంబంధం
తన బిడ్డనూ పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి
ఒప్పుకోకపోవడంతో యువకుడి భార్య, కొడుకుపై పెట్రోల్‌‌ పోసి నిప్పంటించిన మహిళ
స్పాట్​లోనే ​యువకుడి భార్య, ఆస్పత్రిలో 6 నెలల బాబు మృతి
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం

చండూరు (నాంపల్లి), వెలుగు:  తన బిడ్డను పెండ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిపై కోపంతో అతడి భార్య, కొడుకుపై పెట్రోల్​ పోసి ఓ మహిళ నిప్పంటించింది. యువకుడి భార్య స్పాట్​లోనే చనిపోగా.. 6 నెలల బాబు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. కేతేప‌‌ల్లి గ్రామానికి చెందిన న‌‌గేశ్‌‌ యాద‌‌వ్‌‌, మమత (25) దంపతులకు 6 నెలల బాబు ఉన్నాడు. నగేశ్‌‌యాదవ్‌‌కు, అదే గ్రామానికి చెందిన సుజాతతో కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది.

ఆమెకు పెండ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో ఒకరితో కూడా నగేశ్​యాదవ్​కు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఈ క్రమంలో సుజాత తన కూతురును పెండ్లి చేసుకోవాలని నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒత్తిడి చేసింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో అతడిపై పగ పెంచుకుంది. అతనికి భార్య, బిడ్డ ఉండడం వల్లే తన కూతురిని పెండ్లి చేసుకోవడం లేదని, వారి అడ్డు తొలగించాలని భావించిన సుజాత.. శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నివారం పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కారం, కత్తి తీసుకొని నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి వెళ్లింది. 

బాబుకు పాలు పడుతున్న మమతపై పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోసి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో తాళలేక మమత త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న ఒడిలోని బిడ్డను కిందకు విసిరేసింది. మమతకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. బాబుకు కూడా మంటలు అంటుకొని తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే  ఆ బాబును హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీలోఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. నిప్పంటించిన అనంతరం నిందితురాలు సుజాత నాంపల్లి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లొంగిపోయినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నాంపల్లి సీఐ దూదిరాజు, ఎస్సై లింగారెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

చివరి నిమిషం వరకు బిడ్డ ప్రాణాల కోసం పోరాటం 

మరికాసేపట్లో సొంత ఊళ్లో పండక్కి వెళ్లేందుకు సిద్ధమైన మమత.. తన 6 నెలల బిడ్డకు పాలు ఇస్తుండగా అనుకోకుండా ఒక్కసారిగా పెట్రోల్ పోయడంతో భయాందోళనకు గురైంది. అయితే, బిడ్డను కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేసింది. అంతలోనే నిప్పు పెట్టడంతో బిడ్డను పక్కకు పడేసి తాను బలైంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని బ్రతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పట్టికీ ఫలితం దక్కలేదు. తండ్రి వివాహేతర సంబంధం చివరికి తల్లి, బిడ్డల ప్రాణాలు తీయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.