ఫోల్డబుల్ ఐఫోన్ వస్తుందా ? రియాలిటీకి దగ్గరగా డిస్ ప్లే.. త్వరలోనే ఛాన్స్ !

ఫోల్డబుల్ ఐఫోన్ వస్తుందా ? రియాలిటీకి దగ్గరగా డిస్ ప్లే.. త్వరలోనే ఛాన్స్ !

రకరకాల పుకార్లు,  అంచనాల తర్వాత అమెరికన్ స్టార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్ ఫోల్డబుల్ OLED డిస్‌ప్లేల తయారీ ప్రారంభించడంతో  మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు  తెలుస్తుంది. ఈ డిస్‌ప్లేలను ప్రస్తుతం Samsung తయారు చేస్తోంది. ఇందుకు దక్షిణ కొరియాలోని అసన్‌లోని A3 ఫ్యాక్టరీలో ఒక ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు, ఇందులో ఏడాదికి  కోటిన్నర 7-అంగుళాల ఫోల్డబుల్ OLED ప్యానెల్‌లను తయారు చేయగలదని కూడా తెలిపింది. అయితే, ఆపిల్ 2026 నాటికి దాదాపు 60 నుండి 80 లక్షల ఫోల్డబుల్ ఐఫోన్‌లను తయారు చేస్తుందని చెబుతున్నారు.

ఈ వార్తలు నిజమైతే ఆపిల్ మొట్టమొదటి ఐఫోన్ ఫోల్డబుల్ 4:3 యాస్పెక్ట్ రేషియో, క్రీజ్-ఫ్రీ ఫినిషింగ్‌తో 7-అంగుళాల OLED స్క్రీన్‌తో ఇన్‌వర్డ్-ఫోల్డింగ్ డిజైన్‌, ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఆపిల్ సూపర్-స్లిమ్ 4.5mm మందంతో, ఫేస్ ఐడికి బదులుగా టచ్ ఐడి ఇంకా వైడ్ & అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కూడా తీసుకురావచ్చు. దీనిలో మనం ఆపిల్ సిలికాన్ A20 చిప్‌సెట్‌  చూడవచ్చు.

MacRumors ప్రకారం, Apple సాధారణంగా పెద్ద సప్లయ్  చైన్తో ఉంటుంది, కానీ ఫోల్డబుల్ టెక్నాలజీలో అనుభవం లేకపోవడంతో  Samsung  ఫోల్డబుల్ ఐఫోన్ కోసం స్పెషల్ ప్యానెల్ సప్లయర్ అని చెబుతున్నారు. Samsung 2019 నుండి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తోంది ఇంకా గతంలో iPhone Xతో Apple LCD నుండి OLEDకి మారడంలో కీలక పాత్ర పోషించింది. 

సమాచారం ప్రకారం, ఐఫోన్ ఫోల్డ్, ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు 2026లో లాంచ్ కావచ్చు. దీని ధర రూ.1,70,000 ఉండొచ్చని అంచనా. వార్తలు చూస్తే ఇది ఇప్పటికీ ఉత్పత్తి దశల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎక్కువ ధర కారణంగా ఆపిల్ ఈ ఫోన్ను మొదట కొన్ని దేశాల్లోనే  లాంచ్ చేసే అవకాశం ఉంది.