
శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా దంపతులపై కేసు నమోదయ్యింది. వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో వినూత, ఆమె భర్త చంద్రబాబుపై కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు. జులై 8న చెన్నై మింట్ పరిధిలోని కూవం నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతుడి చేతి మీద జనసేన సింబల్ తో పాటు వినూత పేరు ఉండటంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత, ఆమె చంద్రబాబును విచారించి.. మృతదేహం ఆమె డ్రైవర్ రాయుడుదిగా నిర్దారించరు.
ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోడౌన్‌లో డ్రైవర్ రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడేసినట్లు గుర్తించారు పోలీసులు.డ్రైవర్ శ్రీనివాస్ హత్యకు రెండు వారాల ముందే అతడిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి గోడౌన్ లో రాయుడుని హత్య చేసి శవాన్ని కూవం నదిలో పడేసినట్లు గుర్తించారు పోలీసులు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. శ్రీనివాస్ చేసిన ద్రోహానికి జూన్ 21 నుంచి విధుల నుంచి అతన్ని తొలగిస్తున్నట్లు వినూత ప్రకటించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.శ్రీనివాసులు మృతి కేసుకి సంబంధించి ఆరోపణలు వస్తున్న క్రమంలో వినూతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది జనసేన.
బొక్కసంపాలెం గారమానికి చెందిన శ్రీనివాస్ కొంతకాలంగా వినూత వ్యక్తిగత సహాయకుడిగా, డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21న శ్రీనివాస్ చేసిన ద్రోహానికి అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు వినూత. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వినూత. ఇకపై శ్రీనివాసులుకు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది వినూత. శ్రీనివాసులు హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.