రాష్ట్రస్థాయి ఫుట్బాల్ విన్నర్ నిజామాబాద్ టీమ్

రాష్ట్రస్థాయి ఫుట్బాల్ విన్నర్ నిజామాబాద్ టీమ్

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్​బాల్ పోటీల్లో విజేతగా నిజామాబాద్ జిల్లా జట్టు నిలిచింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లోని సింగరేణి ఠాగూర్​స్టేడియంలో శుక్రవారం పోటీలు నిర్వహించారు.  ఫైనల్‎లో నిజామాబాద్,​-ఖమ్మం జిల్లాల జట్లు పోటీ పడ్డాయి. 3-0గోల్స్​తేడాతో నిజామాబాద్​గెలుపొందింది. రెండోస్థానాన్ని ఖమ్మం, మూడో స్థానాన్ని రంగారెడ్డి, నల్గొండ జిల్లా జట్లు కైవసం చేసుకున్నాయి.

 విజేతలకు మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్, క్యాతనపల్లి మున్సిపల్​కమిషనర్​గద్దె రాజు, రామకృష్ణాపూర్​ టౌన్​ ఎస్ఐ  రాజశేఖర్​బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సింగరేణి పర్సనల్​ మేనేజర్​ శ్యాసుందర్, కాంగ్రెస్ ​లీడర్​ బండి సదానందం యాదవ్, ఫుట్​బాల్ అసోసియేషన్​ జనరల్ సెక్రటరీ రఘునాథ్​రెడ్డి, కాంగ్రెస్ టౌన్​ ప్రెసిడెంట్​ పల్లె రాజు, కాంగ్రెస్, సీపీఐ లీడర్లు గాండ్ల సమ్మయ్య, సాగర్​రెడ్డి, మిట్టపెల్లి శ్రీనివాస్​ పాల్గొన్నారు.