మున్సిపోల్స్ లో .. భార్యభర్తలు గెలుపు

మున్సిపోల్స్ లో ..  భార్యభర్తలు గెలుపు

బోధన్, వెలుగు : బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలు గెలుపొందారు. కాంగ్రెస్​అభ్యర్థి తూము శరత్ రెడ్డి 25వ వార్డులో 575 ఓట్ల మెజార్టీ సాధించారు.  ఆయన భార్య తూము పద్మ 35వ వార్డులో కాంగ్రెస్​ అభ్యర్థిగా విజయం సాధించారు.  తూము పద్మాశరత్​ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్​ పర్సన్​గా పని చేశారు. తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గెలిపించిన కాలనీల వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.    

 కామారెడ్డిలో...      

కామారెడ్డిటౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా భార్యభర్తలు విజయం సాధించారు. వీరిద్దరూ  బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 46వ వార్డు నుంచి భర్త గెరుగంటి లక్ష్మీనారాయణ, 47 నుంచి భార్య గెరుగంటి స్వప్న విజయం సాధించారు.   గత కౌన్సిల్​లో గెరుగంటి స్వప్న 47 వ వార్డు నుంచి కౌన్సిలర్​గా కొనసాగారు. గెలిపించిన కాలనీల వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.