ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది మహిళా కౌన్సిలర్లు విజయం సాధించారు. 36వ వార్డుకు చెందిన బారడ్ గంగామణి (కాంగ్రెస్) అత్యధికంగా 73 సంవత్సరాలు కలిగి ఉన్నారు. ఆమె కొడుకు బారడ్ రమేశ్సిట్టింగ్ కౌన్సిలర్‌గా ఉండి తన తల్లిని గెలిపించుకున్నారు.
19వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన దీయా అగర్వాల్ (24ఇండిపెండెంట్) పిన్నవయస్కురాలు. టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో తన సోదరి దీయా అగర్వాల్‌ను కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేయించి గెలిపించుకున్నారు.
