
అమెజాన్ ప్రైమ్ డే సేల్ రేపటి నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్ కంటే ముందే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై ఇస్తున్న డిస్కౌంట్ ఆఫర్‌లను చూపించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఆక్సెసరీలు, ల్యాప్‌టాప్‌లతో సహా చాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇంకా ఐఫోన్, రెడ్‌మి, రియల్‌మి, మోటరోలాతో పాటు శామ్‌సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అదిరిపోయే డిస్కౌంట్స్ ఇస్తుంది. అయితే సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను కొనే అవకాశం కూడా ఉంది. ఇందులో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా నుండి గెలాక్సీ ఎం36 5జి వరకు చాల ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి.
ఈ సేల్ లైవ్ పేజీ ప్రకారం, Samsung Galaxy A36 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,499కి కొనొచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.22,999. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా లాంచ్ అయింది కూడా. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, అలాగే 8GB వరకు RAM & 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే, ఇన్-హౌస్ చిప్‌సెట్‌తో, ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 13MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ సేల్లో రూ.1,34,999 MRP ధర ఉన్న Samsung ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S24 Ultra 5Gని రూ.74,999కి కొనొచ్చు. అంటే ఈ ఫోన్ రూ.60వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ప్రీమియం ఫోన్‌లను కొనాలనుకునే వారికి ఇదొక బెస్ట్ డీల్ అఫర్ అని చెప్పొచ్చు. దీనికి 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 5000mAh పెద్ద బ్యాటరీ. ఫోన్ 6.8-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ S పెన్ సపోర్ట్‌తో వస్తుందో 12GB RAMతో 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
ALSO READ : Amazon Prime Sales టార్గెట్ గా 36 వేల ఫేక్ వెబ్‌సైట్స్, లింక్స్.. జాగ్రత్తగా లేకపోతే మీ డబ్బులు గోవిందా..!
Samsung Galaxy A55 5G 12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల పూర్తి HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్, IP67 రేటింగుతో దీని MRP ధర రూ. 42,999. అమెజాన్ సేల్‌లో కేవలం రూ. 24,999కే కొనొచ్చు. ఈ సేల్‌లో ICICI, SBI కార్డ్‌లపై 10-10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆక్సెసరీలపై 40 శాతం తగ్గింపుతో కోనోచ్చు. ఈ సేల్ జూలై 12 నుండి 14 వరకు కొనసాగుతుంది. అయితే, కస్టమర్లు సేల్ సమయంలో ఏదైన కొనేటప్పుడు అఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.