
Amazon Prime: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ డే సేల్ జూలై 12 నుంచి 14 వరకు ప్రకటించింది. అయితే ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వ్యక్తులకు ఇది ఒకరోజు ముందుగానే స్టార్ట్ అయిపోయింది. ఇందులో కంపెనీ ఎలక్ట్రానిక్స్ నుంచి ఫర్నిచర్ వరకు అన్ని ఉపకరణాలు, ఉత్పత్తులపై దాదాపు 60 శాతం వరకు భారీ తగ్గింపులను ఆఫర్ చేయనుంది.
అయితే దీనిని క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. అమెజాన్ పేరుతో నకిలీ వెబ్ సైట్లు, అమెజాన్ మాదిరిగా ఉండే పేజీలు సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా వీటి సంఖ్య పుట్టగొడుగుల్లా పెరిగింది. అచ్చం అమెజాన్ మాదిరిగా ఉండే డొమైన్ పేర్లతో ఉన్న దాదాపు 36వేలకు పైగా ఫేక్ వెబ్ సైట్లను ఇప్పటికే గుర్తించారు. దేశవ్యాప్తంగా సేల్ సందర్బంగా కోట్ల మంది యూజర్లు లాగిన్ అవుతున్న వేళ ఫేక్ వెబ్ సైట్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇవి ఆన్ లైన్ మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తు్నారు.
ALSO READ : Apple: ఫాక్స్‌కాన్ చైనా టెక్నీషియన్స్ వెనక్కి.. సమస్య పరిష్కారానికి ఆపిల్ ప్లాన్స్..
ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు “.top”, “.online” అని వెబ్ అడ్రస్ చివరన ఉండేలా సైట్లను క్రియేట్ చేస్తున్నట్లు గుర్తించబడింది. ఇలాంటి వాటిపై ఇప్పటికే అమెజాన్ కేసులు పెట్టింది. ఈ నకిలీ వెబ్ సైట్లలో పొరపాటున లాగిన్ అయితే అవి వెంటనే యూజర్లకు సంబంధించిన పాస్ వర్డ్స్, ఇతర సెన్సిటివ్ డేటా తస్కరించబడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్లు రీఫండ్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తేలింది.
ఈ టిప్స్ పాటిస్తే మీరు సైబర్ నేరగాళ్ల బారినుంచి తప్పించుకోవచ్చు..
–అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను అంటిపెట్టుకుని ఉండండి.
– ఖాతాను అప్‌డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని అడుగుతూ ఈ-మెయిల్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
– అధిక డిస్కౌంట్ల మాటున ఆకర్షణీయమైన డీల్స్ కోసం మోసగాళ్ల వలలో చిక్కొద్దు.
– 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ప్రొటోకాల్స్ పాటించండి.
– మెుబైల్ ఫోన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, బ్రౌజర్‌లను అప్డే్ట్ చేసుకోండి
చివరిగా ప్రైమ్ డే అనేది స్కామర్లకు ప్రధాన సమయం. అప్రమత్తంగా ఉండండి.. తెలివిగా షాపింగ్ చేయండి. ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. వీలైనంత వరకు మీరు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న అధికారిక అమెజాన్ యాప్ ద్వారా షాపింగ్ చేయటం కొంత రిస్క్ తగ్గిస్తుందని గుర్తుంచుకోండి.